wasim akram: నిషేధానికి గురైన పాక్ ఆటగాడికి వసీం అక్రమ్ సలహా

  • హఫీజ్ కు అక్రమ్ సలహా
  • బౌలింగ్ కాదు, బ్యాటింగ్ పై ఫోకస్ చేయాలి
  • అది హఫీజ్ కే కాదు, టీమ్ కు కూడా మంచిది

బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉందనే కారణంతో పాక్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హఫీజ్ నిషేధం ఎదుర్కోవడం ఈ మూడేళ్లలో ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో హఫీజ్ కు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కీలక సూచన చేశాడు. బౌలింగ్ మెరుగుపరుచుకునే దానికంటే బ్యాటింగ్ పై దృష్టి సారించడమే మేలు అని చెప్పాడు. హఫీజ్ కు క్రికెట్లో ఎంతో అనుభవం ఉందని... కాబట్టి బ్యాటింగ్ పై ఫోకస్ చేసి అందులో రాణిస్తే... అతనికే కాకుండా, టీమ్ కు కూడా ఉపయోగపడుతుందని తెలిపాడు. హఫీజ్ బంతులను విసిరేటప్పుడు నిర్ణీత 15 డిగ్రీలకు మించి వంచుతున్నాడని తేలడంతో అతనిపై వేటు పడింది. 

wasim akram
hafeez
pak cricket board
  • Loading...

More Telugu News