mannki baat: 'మన్ కీ బాత్' కోసం ప్రజల సలహాలు అడుగుతున్న ప్రధాని
- నవంబర్ 26న ప్రసారం కానున్న కార్యక్రమం
- యాప్‌లో గానీ, 1800-11-7800కి గానీ కాల్ చేసి చెప్పండి
- MyGov వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయొచ్చు
దేశ ప్రజలతో మమేకమయ్యే ఉద్దేశంతో నిర్వహించే మన్ కీ బాత్, నవంబర్ నెల ఎపిసోడ్లో మాట్లాడేందుకు సలహాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. 'నవంబర్ 26, ఆదివారం ప్రసారం కాబోయే ఈ నెల 'మన్ కీ బాత్' కోసం మీ ఐడియాలు ఏంటి?.. నరేంద్ర మోదీ మొబైల్ యాప్‌లోగానీ, 1800-11-7800కి కాల్ చేసి గానీ లేదంటే MyGov ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేసి గానీ చెప్పండి` అని మోదీ ట్వీట్ చేశారు.
'మన్ కీ బాత్' 38వ ఎపిసోడ్‌కి ప్రధాని మీ సలహాలు కోరుతున్నాడంటూ మైగవ్ పోర్టల్‌లో ఉంది. ప్రధానికి సూచనలు, సలహాలను హిందీ, ఇంగ్లిషు భాషల్లో రికార్డు చేసి పంపించవచ్చు. వీటిలో కొన్ని రికార్డులను కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేయనున్నట్లు మైగవ్ పోర్టల్ పేర్కొంది. 1922 నెంబర్‌కి మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా కూడా సలహాలు పొందుపరిచే లింక్‌ను చేరుకోవచ్చని తెలిపింది. ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ఆలిండియా రేడియో, డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రసారమవుతోంది.