visakhapatanam: వైజాగ్ లో గుడ్లగూబను పోలిన మూడు వింత ఆకారాలు... సోషల్ మీడియాలో వీడియో వైరల్

  • నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేసేందుకు వెళ్లిన కార్మికుల కంటబడ్డ విచిత్ర ఆకారాలు
  • గుడ్లగూబను పోలిన మూడు చిత్రమైన ఆకారాలు
  • పక్షులో, జంతువులో తెలియక తికమక

విశాఖపట్టణంలోని కంచరపాలెంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వింత ఆకారాలు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. కంచరపాలెంలో ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అక్కడ పని చేసేందుకు భవన నిర్మాణ కార్మికులు వెళ్లారు. సన్ షేడ్ పై గుడ్లగూబలను పోలిన మూడు చిత్రమైన ఆకారాలు వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. వాటిని తొలుత అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేసిన కార్మికుడు... అవి విచిత్రంగా ఉండడంతో సహచరుడికి తెలిపాడు.

 దీంతో ఆయన వాటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ చిత్రమైన ఆకారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి రెండు కాళ్లపై ధైర్యంగా నిల్చొని ఉండడం విశేషం. సాధారణంగా పక్షులు, ఇతర జంతువులు మనిషి అలికిడి కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇవి మాత్రం వీడియో తీస్తుంటే అలా మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. అయితే ఇవి పక్షులో, జంతువులో తెలియక తికమకపడుతున్నారు.

visakhapatanam
Owl
viral video
  • Error fetching data: Network response was not ok

More Telugu News