tibet: టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ లలో భూకంపం.. 6.4 తీవ్రత!

  • టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ లలో 6.4 తీవ్రతతో భూకంపం
  • వేకువ జామున 4:34 గంటలకు సంభవించిన భూకంపం
  • భూకంప కేంద్రం నింగ్చి ప్రాంతం 

టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో భూకంపం సంభవించింది. నేటి వేకువజామున 4:34 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఇదే తీవ్రతతో రెండు సార్లు భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. తరువాత పలు మార్లు ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.  

ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చైనాలో సహయకచర్యలు ప్రారంభమయ్యాయి. భూకంప కేంద్రం నింగ్చి అనే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. భూగర్భంలోని పది కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో అతితక్కువ మానవసంచారం ఉంటుందని, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. 

tibet
arunachalpradesh
earthquake
  • Loading...

More Telugu News