car: ర‌ద్దీగా ఉన్న రోడ్డుపై వృద్ధురాలు.. త‌న‌ కారుని అడ్డం పెట్టి రోడ్డు దాటించిన వ్య‌క్తి.. వీడియో చూడండి!

  • వైర‌ల్ అవుతోన్న వీడియో
  • త‌న కారును ముందుకు తీసుకెళ్లకుండా రోడ్డుపైనే ఆపి ఉంచిన వ్య‌క్తి
  • చైనాలోని జెజియాంగ్‌లో ఘ‌ట‌న‌

వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉన్న రోడ్డును దాటడానికి క‌ష్ట‌ప‌డిపోతోన్న ఓ వృద్ధురాలికి ఓ వ్య‌క్తి త‌న‌ కారు దిగ‌కుండానే సాయ‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో అంద‌రినీ అల‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, చైనాలోని జెజియాంగ్‌లో ఓ వృద్ధురాలు రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ‌దీనిని కారులో వెళుతున్న ఓ వ్యక్తి గమనించాడు. దీంతో తన కారును అక్కడే ఆపి, ఆమెను రోడ్డు దాట‌మ‌న్నాడు.

అయితే, ఇత‌ర వాహ‌నాలు మాత్రం ఆమెను పట్టించుకోకుండా.. ఆమె  ముందు నుంచి దూసుకెళుతున్నాయి. దీంతో ఆ కారులోని వ్యక్తి ఇత‌ర వాహ‌నాలు రాకుండా త‌న కారుని అడ్డుపెట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు రోడ్డు దాటింది. అంద‌రినీ అల‌రిస్తోన్న ఈ వీడియోను మీరూ చూడండి..


 

  • Loading...

More Telugu News