demonitization: కొత్త‌గా రూ.10 నాణేలు వ‌స్తున్నాయి: ఆర్‌బీఐ

  • పది రూపాయల నాణేలు చెల్ల‌వ‌నే పుకారు షికారు
  • పాత‌వి కూడా చెల్లుబాటు అవుతాయి
  • ఎవ‌రయినా తీసుకోక‌పోతే మాకు ఫోన్ చేయండి-ఆర్‌బీఐ

పెద్ద‌నోట్ల ర‌ద్దు జ‌రిగిన తర్వాత పది రూపాయల నాణేలు చెల్ల‌వ‌నే ఓ పుకారు షికారు చేసింది. దానిని ఖండిస్తూ, ఆ నాణేలు చెల్లుతాయని ఆర్బీఐ అప్పట్లో ప్రకటన కూడా చేసింది. ఇప్ప‌టికీ చాలా మంది ప‌ది రూపాయ‌ల నాణేల‌ను తీసుకోవ‌డం లేదు. దీంతో భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మ‌రోసారి ప‌ది రూపాయ‌ల నాణెంపై ప్ర‌క‌ట‌న చేసింది.

ప్ర‌స్తుతం వాడుకలో ఉన్న రూ.10 నాణేలకు కొద్దిగా మార్పులు చేసి కొత్త నాణేలను తయారు చేస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు చలామ‌ణిలో ఉన్న రూ.10 నాణేలు కూడా చట్ట ప్రకారం చెల్లుతాయని స్ప‌ష్టం చేసింది. కొత్త, పాత నాణేలు విభిన్నంగా ఉన్నందున పాత‌వాటిని తీసుకోబోమ‌ని ఎవ‌రైనా చెబితే 044–25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాల‌ని సూచించింది.  

  • Loading...

More Telugu News