waqar younis: స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ తో సమానం: వకార్ యూనిస్

  • ఫిక్సింగ్ చాలా పెద్ద తప్పు
  • బోర్డులు, ఫ్రాంచైజీలు ఉక్కుపాదం మోపాలి
  • ఆటగాళ్లపై దృష్టి సారించాలి

స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ లాంటిదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తెలిపాడు. ఒక్క క్రికెట్ లోనే కాదు ఏ క్రీడలోనైనా ఫిక్సింగ్ అనేది క్షమించరాని తప్పని అన్నాడు. ఈ ఫిక్సింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి ఆయా దేశాల బోర్డులే జోక్యం చేసుకోవాలని చెప్పాడు. పలు దేశాల్లో టీ20 లీగ్ లు జరుగుతున్న నేపథ్యంలో బోర్డులు, ఫ్రాంఛైజీల యాజమాన్యాలు ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నాడు. ఇది జరగకపోతే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో తిరిగి ఫిక్సింగ్ భూతం ప్రవేశిస్తుందని చెప్పాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ జట్టుకు వకార్ బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్నాడు.

waqar younis
pakistan cricket
psl
spot fixing
  • Loading...

More Telugu News