nandi awards: జ్యూరీ చేసేదేమీ లేదు.. సంతకం పెట్టడమే!: నల్లమలుపు బుజ్జి సంచలన ఆరోపణలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8773e6d12ec8bbf7fbe14a9249ae57cde03f4f29.jpg)
- 'లెజెండ్' గొప్ప చిత్రమైతే 'రుద్రమదేవి', 'కంచె' ఎలాంటి సినిమాలు?
- జ్యూరీ సంతకం చేయడానికి తప్ప ఇంకెందుకూ ఉపయోగం లేదు
- జ్యూరీ మెంబర్లు ఈ అవార్డులను ఎంపిక చేయలేదు
నంది అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్లు చేసేదేమీ ఉండదని నల్లమలుపు బుజ్జి తెలిపారు. నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ, జ్యూరీ మెంబర్లు ఈ అవార్డుల ఎంపిక చేయలేదని, లాబీయింగ్ పని చేసిందని అన్నారు. వీళ్లు కేవలం సంతకం పెట్టేవాళ్లేనని అన్నారు. జ్యూరీలో గొప్పవాళ్లే మెంబర్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే వారంతా లాబీయింగ్ ముందు ఏమీ చేయలేకపోయారని నల్లమలుపు బుజ్జితో పాటు బండ్ల గణేష్ కూడా అభిప్రాయపడ్డారు.
'లెజెండ్' గొప్ప సినిమా అన్నప్పుడు 'రుద్రమదేవి', 'కంచె' సినిమాల్లోని చరిత్ర ఎందుకు కనపడలేదని వారు అడిగారు. వాటిపై జ్యూరీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.