bandla ganesh: ఎన్టీఆర్ చాలా మంచివాడు .. ఆయనకి నేను సారీ చెబుతున్నా: బండ్ల గణేశ్

  • ఎన్టీఆర్ ఎంతో గొప్పవాడు 
  • ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడాను 
  • మా నాన్న కూడా బాధపడ్డాడు 
  • త్వరలో ఎన్టీఆర్ ను కలుస్తాను

భారీ చిత్రాల నిర్మాతగా బండ్ల గణేశ్ కి మంచి పేరుంది. ఒక వైపున పౌల్ట్రీ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున సినిమా బిజినెస్ ను చక్కబెడుతూ వస్తున్నారు. 'టెంపర్' తరువాత ఎన్టీఆర్ తో ఆయనకి మనస్పర్థలు వచ్చాయనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ కి ఎదురైంది.

 అందుకాయన స్పందిస్తూ " ఈ రోజు చెబుతున్నాను సార్ .. ఎన్టీఆర్ చాలా గొప్పవాడు .. చాలా మంచివాడు. చెప్పుడు మాటలు విని నేనే దూరం చేసుకున్నాను .. మీ ద్వారా ఆయనకి .. ఆయన ఫ్యాన్స్ కి నేను క్షమాపణ చెబుతున్నాను. ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి తప్పుగా మాట్లాడాను. ఆ మాటలు మా నాన్నను కూడా బాధపెట్టాయి. నిజానికి ఎన్టీఆర్ నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆయనతో చేసిన 'బాద్షా'తో నష్టాలు వచ్చినా .. ఆ తరువాత చేసిన 'టెంపర్' లాభాలు తెచ్చిపెట్టింది. ఆయనని నేను మరోసారి క్షమాపణలు అడుగుతున్నాను .. త్వరలో ఆయనను కలుస్తాను" అని చెప్పుకొచ్చారు.        

bandla ganesh
ntr
  • Loading...

More Telugu News