c kalyan vs nallamalupu bujji: సి.కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నల్లమలుపు బుజ్జి!

  • నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కుర్చీల్లో కూర్చున్నావు
  • సినిమా ఎలా ఉండాలో నువ్వు చెబుతావు?
  • ముందు నువ్వు కూర్చున్న కుర్చీల్లోంచి తప్పుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒక ఛానెల్ చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడుతూ, నంది అవార్డులను గొప్ప సినిమాలకు ఇచ్చామని జ్యూరీ సభ్యులు గుండెమీద చెయ్యేసుకుని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానెల్ నిర్మాత సి.కళ్యాన్ ను ఫోన్ లైన్ లోకి తీసుకుని అవార్డ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? అని అడుగగా, జ్యూరీ నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు.

అవార్డ్స్ మంచి సినిమాలకే ఇచ్చారని అభిప్రాయపడ్డారు. తామంతా సినీ కుటుంబమని, ఇలా రచ్చెకెక్కి వివాదం చేయడం సరికాదని అనగా... దీంతో చిర్రెత్తుకొచ్చిన నల్లమలుపు బుజ్జి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో కుర్చీలలో కూర్చునే నువ్వా? ఏది మంచి సినిమా? ఏది చెడ్డ సినిమా? అని చెప్పేది? మీరు కుర్చీల్లోంచి తప్పుకుని కొత్తవారికి అవకాశమివ్వండి' అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న రీతిలో వాదులాడుకున్నారు. 

c kalyan vs nallamalupu bujji
c.kalyan
nallamalupu bujji
nandi awards
  • Loading...

More Telugu News