Roger Federer: ఒక్క గెలుపుతో రూ. 720 కోట్ల ప్రైజ్‌మనీ.. ఫెదరర్ దెబ్బకు టైగర్ ఉడ్స్ వెనక్కి!

  • రూ.720 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న రోజర్ ఫెదరర్
  • అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్‌గా రికార్డు
  • కెరీర్‌లో 95 టైటిళ్లతో రెండో స్థానం

స్విస్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో జర్మనీకి చెందిన 20 ఏళ్ల అలెగ్జాండర్ జడ్‌వెరెవ్‌ను ఓడించిన ఫెదరర్ 110,235,682 డాలర్ల (దాదాపు 720 కోట్లు) ప్రైజ్ మనీ అందుకుని ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న గోల్ప్ ఆటగాడు టైగర్ ఉడ్స్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టైగర్ ఉడ్స్ తన కెరీర్‌లో 110,061,012 డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.

19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కొల్లగొట్టిన 36 ఏళ్ల ఫెదరర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ సహా మొత్తం ఏడు టైటిళ్లు సాధించాడు. తన కెరీర్‌లో మొత్తం 95 టైటిళ్లు సాధించి అమెరికన్ దిగ్గజ ఆటగాడు జిమ్మీ కానర్స్ (109) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News