hyper aadi: కత్తి మహేష్ ను కమెడియన్ గా వాడుకుంటాను: హైపర్ ఆది

  • కత్తి మహేష్ కు జబ్బర్దస్త్ లో వేషం ఇస్తా
  • అతనిలోని కామెడీ యాంగిల్ ను వాడుకుంటా
  • తను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాడు

కత్తి మహేష్ అంగీకరిస్తే... జబ్బర్దస్త్ స్కిట్ లో అతనిని వాడుకుంటానని హైపర్ ఆది అన్నాడు. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడని, తన స్కిట్ లో మంచి వేషం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆయనలోని కామెడీ యాంగిల్ ను వాడుకుంటానని చెప్పాడు. తాను సెలబ్రిటీ అవ్వాలని మహేష్ అనుకుంటున్నాడని హైపర్ ఆది అభిప్రాయపడ్డాడు.

బిగ్ బాస్ లో పాల్గొన్న సందర్భంగా కత్తి మహేష్ చికెన్ వండిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, తమ సుత్తి రాజేష్ ఇడ్లీలు, దోశలు, పెసరట్లు వేస్తుంటాడని, అవి ఛండాలంగా ఉంటాయని, వద్దురా అన్నా వినడని ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్ పై అవాకులు చవాకులు వాగుతుంటాడని, 'అలా వద్దురా సుత్తి రాజేష్' అన్నా వినడని... పవన్ కల్యాణ్ ను పక్కదేశం (ఇంగ్లండ్) గుర్తిస్తే మనమెందుకు గౌరవించమని ప్రశ్నించాడు. 

hyper aadi
katti mahesh
jabbardust
  • Loading...

More Telugu News