Shahrukh Khan: షారుఖ్ ఖాన్ ను ఎయిర్ పోర్ట్ వద్ద డ్రాప్ చేసిన మమతా బెనర్జీ!

  • చలన చిత్రోత్సవ కార్యక్రమం కోసం కోల్ కతా వెళ్లిన షారుఖ్
  • అనంతరం అతన్ని ఎయిర్ పోర్ట్ వద్ద డ్రాప్ చేసిన దీదీ
  • మమత కాళ్లకు నమస్కరించిన షారుఖ్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, కోల్ కతాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమం కోసం షారుఖ్ కోల్ కతా వెళ్లాడు. కార్యక్రమం మగిసిన తర్వాత ఆయనను మమతా బెనర్జీ స్వయంగా తన శాంట్రో కారులో ఎయిర్ పోర్టు వద్ద డ్రాప్ చేశారు.

అనంతరం ఆమె కాళ్లకు నమస్కరించి విమానాశ్రయంలోకి వెళ్లిపోయాడు షారుఖ్. ఇదే సందర్భంలో ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న మీడియా సిబ్బంది... ఇంత చిన్న కారులో చాలా కాలం తర్వాత ప్రయాణించడం ఎలా ఉందంటూ ఫారుఖ్ ను ప్రశ్నించింది. అయితే, ఎలాంటి కామెంట్ చేయకుండానే షారుఖ్ లోపలకు వెళ్లిపోయాడు. మమత అంటే షారుఖ్ కు చాలా అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆమెను సొంత అక్కలానే షారుఖ్ భావిస్తాడు.

Shahrukh Khan
mamatha banerjee
hollywood
  • Loading...

More Telugu News