: అంటు వ్యాధుల పాలిట బుల్లి డిటెక్టివ్
బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే సకల అంటు వ్యాధులను సత్వరం పసిగట్టే ఒక బుల్లి పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది క్షయ వ్యాధిని కూడా సులభంగా పసిగడుతుంది కేవలం ఇది ఇన్ఫెక్షన్లను గుర్తించడం మాత్రమే కాదు. యాంటీబయాటిక్స్‌ను తట్టుకోగల బ్యాక్టీరియాల ఉనికిని కూడా తెలియజేస్తుందట .
క్యాన్సర్‌ను గుర్తించేందుకు తయారుచేసిన ఒక చిన్న పరికరానికి చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా డాక్టర్లు ఆ పరికరం సకల అంటువ్యాధుల బ్యాక్టీరియాను గుర్తించేలా మార్చారు. మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్లు ఈ ఘనత సాధించారు. మైక్రోఫ్లూయిడిక్ పరిజ్ఞానాన్ని, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసొనెన్స్ తో మేళవించి దీన్ని రూపొందించారు. దీనివలన కేవలం రోగికి సోకిన ఇన్ఫెక్షన్ను గుర్తించడం మాత్రమే కాకుండా.. ఎలాంటి మందు ఇవ్వాలో కూడా తేలిపోతుందని డాక్టర్ రాల్ఫ్ వెయిస్లెడర్ అంటున్నారు.