రామోజీరావు: ‘ఈనాడు’ గ్రూప్ అధినేత రామోజీరావుకు బర్త్ డే విషెస్ చెప్పిన పరుచూరి!
- పత్రికా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు
- రామోజీరావుకు జన్మదిన శుభాకాంక్షలు
- ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’, ‘పరుచూరి పాఠాలు’ ద్వారా అలరిస్తున్న విషయం తెలిసిందే. సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల పుట్టిన రోజులను పురస్కరించుకుని గ్రీటింగ్స్ తెలియజేసే పరుచూరి, తాజాగా ఓ ట్వీట్ చేశారు.
‘ఈనాడు’ గ్రూపు అధినేత రామోజీరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పత్రికా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు, నిగర్వి, నిప్పులాంటి మనిషి, నిర్భయుడు రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు ఫొటోను పరుచూరి పోస్ట్ చేశారు.