టీఆర్ఎస్: టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాసరావు హత్యలో ముగ్గురు వ్యక్తులు.. పోలీసుల అనుమానం!
- సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, నాలుగు గ్లాసులు
- శ్రీనివాసరావును వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ లో ఓ వర్గం?
- ఏపీలోని పాలకొల్లు అతని స్వస్థలం
- కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డ నాయకుడు
హైదరాబాద్ సనత్ నగర్ లో టీఆర్ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లతో పాటు నాలుగు గ్లాసులు ఉన్నాయి. మద్యం సేవించిన అనంతరం, మిగిలిన ముగ్గురు వ్యక్తులు కలిసి శ్రీనివాసరావును హతమార్చి ఉండొచ్చనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లుకు చెందిన శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. టీఆర్ఎస్ లోని మరో వర్గం వ్యక్తులు శ్రీనివాసరావును వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గొడవలు తలెత్తి ఆయన్ని హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.