సాఫ్ట్ వేర్ ఉద్యోగిని: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం .. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

  • బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీసు వద్ద ఘటన
  • టూవీలర్ పై రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
  • అక్కడికక్కడే ఉద్యోగిని దుర్మరణం

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శిరీష మృతి చెందింది. టూవీలర్ పై వెళుతున్న ఆమె పెన్షన్ ఆఫీసు వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆమె తలపై నుంచి బస్సు వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈరోజు మధ్యాహ్నం విధుల నిమిత్తం ఆఫీసుకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బంజారాహిల్స్ రోడ్ నెం.12లో స్పిన్ స్కీ సాఫ్ట్ వేర్ కంపెనీలో శిరీష పనిచేస్తున్నట్టు సమాచారం. బంజారాహిల్స్ లోని అనంతనగర్ కాలనీలో ఆమె నివసిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆఫీసుకు నడుచుకుంటూ శిరీష వెళ్లేదని, ఈరోజు మాత్రం వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News