pixel 2 xl: భారత్‌లో ప్రారంభమైన గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు
- 64 జీబీ వేరియంట్ ధర రూ. 73,000
- 128 జీబీ వేరియంట్ ధర రూ. 82,000
- ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అమ్మకాలు
గూగుల్ ప్రతిష్ఠాత్మక స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 2 ఎక్స్ఎల్' అమ్మకాలు ఇవాళ్టి నుంచి భారతదేశంలో ప్రారంభమయ్యాయి. 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. 64 జీబీ వేరియంట్ ధర రూ. 73,000గా, 128 జీబీ వేరియంట్ ధర రూ. 82,000గా సంస్థ నిర్ణయించింది. బ్లాక్, బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఆన్‌లైన్‌లో అయితే ఫ్లిప్‌కార్ట్‌లో, ఆఫ్‌లైన్‌లో అయితే రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 4 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో పాటు 3520 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి.