lakshmi parvathi: లక్ష్మీపార్వతి నుంచి నన్ను కాపాడండి: డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

  • లక్ష్మీపార్వతి నుంచి ప్రాణహాని ఉంది
  • కొందరు నన్ను ఫాలో అయ్యారు
  • నాకు రక్షణ కల్పించండి

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ సందర్భంగా తనను గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అయ్యారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తెలిపారు.

మరోవైపు, ఎన్టీఆర్ సమాధిని నిన్న లక్ష్మీపార్వతి పాలతో కడిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేతిరెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. తన భర్త సమాధి వద్దకు వచ్చిన కేతిరెడ్డిలాంటి పాపులు... ఇక్కడ ఉచ్చరించకూడని పేర్లను పలికారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్న ఎవరూ ఇలాంటి సినిమాలు తీయరని అన్నారు. కేతిరెడ్డిని 'ఓ ప్లాట్ ఫామ్ గాడు' అంటూ సంబోధించారు.

lakshmi parvathi
ketireddy jagadiswar reddy
lakshmis veeragrandham
  • Loading...

More Telugu News