Mahesh Babu: 'భరత్ అనే నేను'లో హైలైట్ గా నిలవనున్న 'హోలీ' ఫైట్!

  • ఇటీవలే యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • తదుపరి షెడ్యూల్ ఈ నెల 26 నుంచి 
  • ఈ లోగా హాలీవుడ్ నుంచి తిరిగి రానున్న మహేశ్ 
  • ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు  

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. టైటిల్ పరంగా .. మహేశ్ లుక్ పరంగా క్లాస్ గా అనిపించినా, మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. రీసెంట్ గా చిత్రీకరించిన 'హోలీ' ఫైట్ అందుకు నిదర్శనమని చెబుతున్నారు.

ఇటీవలే 'హోలీ' పండుగ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ ఫైట్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ థమ్స్ అప్ యాడ్ కోసం హాలీవుడ్ వెళ్లాడట. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత, ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ సంగీతం .. కైరా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.   

  • Loading...

More Telugu News