yeswanth sinha: మహ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు చేపట్టారు: మరోసారి విరుచుకుపడ్డ యశ్వంత్ సిన్హా

  • చరిత్రలో ఎంతో మంది రాజులు తమ కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చారు
  • కొందరు రాజులు పాత కరెన్సీని కొనసాగిస్తూనే కొత్త కరెన్సీని తెచ్చారు
  • తుగ్లక్ మాత్రం పాత కరెన్సీని రద్దు చేసి, కొత్త కరెన్సీని వినియోగంలోకి తెచ్చారు

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి పెద్దనోట్ల రద్దుపై విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన పిచ్చితుగ్లక్ గా పేరొందిన 14వ శతాబ్దపు డిల్లీ సుల్తాన్‌ మ‌హ‌మ్మ‌ద్‌ బిన్‌ తుగ్లక్‌ నిర్ణయంతో పోల్చుతూ విమర్శలు చేశారు. డీమానిటైజేషన్, జీఎస్టీపై అభిప్రాయాలను లోక్ షాహి బచావో అభియాన్ (సేవ్ డెమోక్రసీ మూవ్ మెంట్) గ్రూప్ కార్యక్రమంలో పంచుకుంటూ, 700 ఏళ్ల క్రితమే తుగ్లక్ నోట్ల రద్దు తీసుకొచ్చారని అన్నారు.

 చరిత్రలో ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. అయితే 700 ఏళ్ల క్రింతం పిచ్చితుగ్లక్ పాత కరెన్సీని రద్దు చేసి, కొత్త కరెన్సీని తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నిర్ణయాలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిందని, దేశ ఆర్థికవ్యవస్థను కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. కాగా, గత కొంత కాలంగా యశ్వంత్ సిన్హా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

yeswanth sinha
comments
criticism
demonitaization
gst
  • Loading...

More Telugu News