జగన్: నాడు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆన్ లైన్ లో కనిపించదే!: వైఎస్ జగన్
- ఎనిమిదో రోజుకు చేరిన జగన్ పాదయాత్ర
- 2014లోని టీడీపీ మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి ఎందుకు తొలగించారు?
- ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే దాన్ని తొలగించారు
- జగన్మోహన్ రెడ్డి విమర్శ
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. కర్నూలు- కడప జిల్లా సరిహద్దులోని ఎస్ఎస్ దాబా నుంచి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో తాను ప్రకటించిన మేనిఫెస్టోను టీడీపీ ఆన్ లైన్ లో నుంచి ఎందుకు తొలగించిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆన్ లైన్ లో నుంచి ఆ మేనిఫెస్టోను తొలగించారని విమర్శించారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నట్టయితే గుండ్రేవుల, రాజోలి ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు కింద రెండు పంటలకు నీరు అందేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ నిధులు వడ్డీకే సరిపోలేదని , పేదలకు ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టివ్వలేదని జగన్ విమర్శించారు.