delhi: ఢిల్లీ రేయాన్ స్కూల్ బాలుడి హత్య కేసులో సరికొత్త ట్విస్టు!

  • స్కూల్ టాయిలెట్ లో హత్యకు గురైన బాలుడు ప్రద్యుమ్న్  
  • బస్సు డ్రైవర్ అశోక్ ని అదుపులోకి తీసుకున్న సీబీఐ 
  • అనంతరం డ్రైవర్ విడుదల.. మరో విద్యార్థి హంతకుడంటూ సీబీఐ ప్రకటన 
  • తాను హత్య చేయలేదంటున్న విద్యార్థి 

దేశరాజధాని ఢిల్లీలోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ లో సెప్టెంబర్ 8న హత్యకు గురైన రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమ్న్ ఠాకూర్ (7) కేసులో సీబీఐ అధికారులు ఊహించని ట్విస్టు వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వస్తే, సెప్టెబర్ 8న రేయాన్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమ్న్ బాత్రూంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఈ హత్యకు కారణం బస్సు డ్రైవర్ అశోక్ అని భావించిన సీబీఐ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

 అనంతరం ఈ కేసులో అశోక్ నిర్దోషి అని, 11వ తరగతి చదువుతున్న విద్యార్థి హంతకుడని తేల్చి చెప్పారు. తండ్రి ముందే 11వ తరగతి విద్యార్థి హత్యానేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అయితే తాజాగా ఆ విద్యార్థి పిల్లల సంరక్షణ అధికారి ఎదుట వాంగ్మూలమిస్తూ, తానా హత్య చేయలేదని తెలిపాడు. తనకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడని, తన తమ్ముడిలాంటి వాడిని ఎందుకు హత్య చేస్తానని అన్నాడు. దీంతో సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News