Miss Brooklyn: మోడలింగ్ వృత్తిని కాదని.. పారిశుద్ధ్య శాఖలో ఉద్యోగిగా చేరిన అందాల సుందరి!

  • మిస్ బ్రూక్లిన్, మిస్ స్తాటేన్ అందాలపోటీల్లో పాల్గొన్న నికోల్ డోజ్
  • న్యూయార్క్ లోని పారిశుద్ధ్య శాఖలో ఉద్యోగిగా చేరిన నికోల్ డోజ్
  • ఈ విధులు నిర్వర్తించే 200 మహిళల్లో ఆమె ఒకరు

సాధారణంగా అందాల కిరీటం గెలిచిన వారెవరి లక్ష్యమైనా మోడలింగ్ అన్న సంగతి తెలిసిందే. అయితే మిస్ బ్రూక్లిన్‌, మిస్ స్తాటేన్‌ గా అందాల పోటీల్లో పాల్గొన్న అందాల సుందరి నికోల్ డోజ్ (23) మోడలింగ్ వృత్తిని కాదని పారిశుద్ధ్య శాఖలో ఉద్యోగిగా చేరడం అందాలరంగంలో సంచలనం రేపింది. న్యూయార్క్ నగరంలోని పారిశుద్ధ్య శాఖలో ఆమె ఉద్యోగిగా చేరింది.

 న్యూయార్క్ నగరంలో పనిచేసే 200 మంది మహిళా ఉద్యోగుల్లో ఆమె ఒకరు కావడం, ఆ పట్టణంలోని ఒక చెత్త సేకరించే రూట్లో ఆమె ఒక్కరే మహిళా ఉద్యోగి కావడం విశేషం. జనవరిలో జరిగే మరో అందాలపోటీలో పాల్గొననున్నానని ఆమె తెలిపింది. అందాల సుందరిగా రాణించడం ఆత్మవిశ్వాసం ఇస్తోందని ఆమె తెలిపింది. బికినీ ధరించి హైహీల్స్ తో నడవడాన్ని ఆస్వాదిస్తానని ఆమె తెలిపింది. 

Miss Brooklyn
Miss Staten Island
Nicole Doz
New York
USA
  • Loading...

More Telugu News