: గేల్ హిట్.. బెంగళూరు హిట్
డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో గేల్ (33 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సులు) సూపర్ హాఫ్ సెంచరీ సాధించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసింది. గేల్ కు తోడు పుజారా (51), డివిల్లీర్స్ (19 బంతుల్లో 38 నాటౌట్), హెన్రిక్స్ (7 బంతుల్లో 16) రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో గోనీ రెండు వికెట్లు తీశాడు.