నారా లోకేశ్: జగన్ పై నారా లోకేశ్, సీఎం రమేష్ వ్యంగ్యాస్త్రాలు!

  • జగన్ కు ఆరోపణలు చేయడం తప్పా వేరే ఏం పనుంది?
  • వైసీపీలో చేరాలంటే సీబీఐ కేసు ఉండాలనేది అర్హత: లోకేశ్
  • జగన్ పాదయాత్రకు సొంత జిల్లాలోనే స్పందన కరవు
  • దావూద్ ఇబ్రహీంతో పోలిక తెచ్చిన సీఎం రమేష్

వైసీపీ అధినేత జగన్ కు ఆరోపణలు చేయడం తప్పా వేరే ఏం పనుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్యారడైజ్ పేపర్లలో తమ పేర్లు లేవని, తమపై సీబీఐ కేసులు లేవని చెబుతూ, వైసీపీలో చేరాలంటే మాత్రం సీబీఐ కేసు ఉండాలనేది అర్హత అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

టీడీపీకి చెందిన మరో నేత సీఎం రమేష్ మాట్లాడుతూ, జగన్ సొంత జిల్లాలోనే ఆయన పాదయాత్రకు స్పందన కరవైందని, సీఎం పదవి కోసమే ఆ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్ చేస్తున్న పాదయాత్ర ఎలా ఉందంటే.. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తిరిగొచ్చి, తన తప్పులు క్షమించమని అడిగినట్టుగా ఆ పాదయాత్ర ఉందని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News