జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

  • హంద్వారాలో పోలీసుల బృందంపై ఉగ్రవాదుల కాల్పులు
  • దీటుగా స్పందించిన పోలీసులు
  • ఇద్దరు ఉగ్రవాదుల హతం 

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. హంద్వారాలో పోలీసుల బృందంపై ఈరోజు దాడి జరిగింది. వెంటనే, దీటుగా స్పందించిన పోలీసుల బృందం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల్లో ఒకరికి గాయాలయ్యాయని, ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.  

  • Loading...

More Telugu News