krishna boat accident: పడవ ప్రమాదంలో మరణించిన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెపోటుతో తల్లి మృతి!

  • పడవ ప్రమాదంలో మృతి చెందిన లీలావతి
  • కుమార్తె మృతి సంగతి తెలిసి కన్నీరు మున్నీరైన తల్లి
  • కూతురి శవాన్ని చూసి గుండెపోటుతో తల్లి మృతి 

కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం ఘటన నేపథ్యంలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్న జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లీలావతి అనే మహిళ మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు ఒంగోలు పంపించారు. ఈ మృతదేహాన్ని చూసిన ఆమె తల్లి గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నిండుకుంది. నిన్న దారుణం చోటుచేసుకుందని తెలిసిన నాటినుంచి ఆమె ఏడుస్తూనే ఉందని, కుమార్తెను విగతజీవిగా చూసి తట్టుకోలేకపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 

krishna boat accident
boat accident
daughter and mother dead
  • Loading...

More Telugu News