gowthami: కేన్సర్ ను జయించి ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఇదే!: నటి గౌతమి

  • మంచి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
  • నేను ప్రాణాలతో ఉండటానికి కారణం నాలో ఉన్న ధైర్యమే
  • బ్రెస్ట్ కేన్సర్ ఉన్నవారంతా ధైర్యంతో ముందుకు సాగాలి

బ్రెస్ట్ కేన్సర్ కు ఇప్పుడు మంచి వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని నటి గౌతమి అన్నారు. కేన్సర్ కు గురైనవారు ధైర్యంగా ఉండాలని, సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని ఆమె తెలిపారు. బ్రెస్ట్ కేన్సర్ కు గురైన తాను ఈ రోజు ఇక్కడ ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నాలో ఉన్న ధైర్యమే అని చెప్పారు. 'లైఫ్ అగెయిన్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో నిన్న విన్నర్స్ వాక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేన్సర్ ని జయించినవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి జయసుధ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, తగిన చికిత్స చేయించుకుంటే వ్యాధి నయమవుతుందని చెప్పారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనకడుగు వేయకుండా, ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, నటి ముమైత్ ఖాన్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

gowthami
life again foundation
jayasudha
tammareddy bharadwaja
  • Loading...

More Telugu News