bhuma akhilapriya: బోటు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి అఖిలప్రియ

  • ప్రమాదానికి గల కారణాలపై ఆరా
  • అధికారులతో సమీక్ష
  • తక్షణ విచారణకు ఆదేశం

విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం ప్రకటించారు. బాధితులకు అందించాల్సిన తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

 బోటు ఎప్పుడు బయల్దేరింది? ప్రయాణ సమయంలో బోటులో ఎంత మంది ఉన్నారు? పరిమితికి మించి బోటులో ఎక్కించుకున్నారా? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. బోటు నిర్వాహకులైన రివర్ బోటింగ్ సంస్థ, సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థల లైసెన్స్ ల గురించి ఆరా తీశారు. తక్షణమే ఘటనపై విచారణ జరపాలంటూ అధికారులను ఆదేశించారు.

bhuma akhilapriya
ap minister
vijayawada boat accident
  • Loading...

More Telugu News