madhya pradesh: మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నిక: తన స్థానాన్ని కాపాడుకున్న కాంగ్రెస్

  • ఉపఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్
  • 14,133 ఓట్ల తేడాతో విజయం
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోవడంతో అనివార్యమైన ఉప ఎన్నిక

మధ్యపదేశ్ లో చిత్రకూట్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నిలాంశు చతుర్వేది తన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత శంకర్ దయాళ్ త్రిపాఠీపై 14,133 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చతుర్వేదికి 66,810 ఓట్లు రాగా... త్రిపాఠీకి 52,677 ఓట్లు పడ్డాయి.

ఈ నెల 9వ తేదీన ఈ ఉప ఎన్నిక జరిగింది. 65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో తిరిగి కాంగ్రెస్ పార్టీనే గెలవడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.

madhya pradesh
congress
bjp
  • Loading...

More Telugu News