kim jong un: నేనెప్పుడైనా నిన్ను కొవ్వెక్కిన పొట్టోడు అన్నానా?: కిమ్ జాంగ్ ఉన్ పై ట్రంప్ ఫైర్

  • ట్రంప్, కిమ్ మధ్య మాటల మంటలు
  • 'ట్రంప్‌ వృద్ధుడు, ఆయన వల్ల ఏమవుతుంది?' అన్ని కిమ్ జాంగ్ ఉన్
  • 'కిమ్‌ పొట్టిగా, లావుగా ఉన్నాడు అని అన్నానా? నా స్నేహితుడిని నేను అలా అనగలనా?' అన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల యుద్ధంగా రూపాంతరం చెందింది. ట్రంప్‌ ఆసియా పర్యటన నేపథ్యంలో స్పందించిన కిమ్... 'ట్రంప్‌ వృద్ధుడు, ఆయన వల్ల ఏమవుతుంది?' అంటూ ఎద్దేవా చేశారు.

దీనికి ట్రంప్ దీటుగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన ‘నన్ను వృద్ధుడంటూ కిమ్ ఎందుకలా అవమానపరుస్తాడు? అసలు నేను ఎప్పుడన్నా కిమ్‌ పొట్టిగా, లావుగా ఉన్నాడు అని అన్నానా? అతనికి స్నేహితుడిగా వుండాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కదా.. ఏదో ఒక రోజు అలా అవుతుంది కూడా..’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చదవండి

kim jong un
Donald Trump
america
North Korea
  • Error fetching data: Network response was not ok

More Telugu News