raja seakhar: కొందరితో అఫైర్లు ఉన్నాయి కానీ తారా చౌదరితో మాత్రం లేదు!: డా.రాజశేఖర్

  • తానేమీ రాముడ్ని కాదన్న రాజశేఖర్ 
  • జీవితతో వివాహానికి ముందు, తరువాత కూడా అఫైర్లు ఉన్నాయి 
  • తారా చౌదరితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ

'గరుడవేగ' సినిమాతో రాజశేఖర్ సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ విజయం ఆయనకు చాలా స్థైర్యాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తనతల్లి మరణం తనను కుంగదీస్తే.. ఈ సినిమా విజయం ధైర్యాన్నిచ్చిందని అన్నారు. గతంలో చాలా రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తారా చౌదరితో సంబంధాలున్నాయట కదా? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు.

 తానేమీ రాముడ్ని కాదని అన్నారు. పెళ్లికి ముందు కొందరితో సంబంధాలున్నాయని చెప్పేశారు. అలాగే జీవితతో పెళ్లి తర్వాత కూడా కొందరితో సంబంధాలున్నాయని ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనతో ఆమె ఒకసారి ఫోటో దిగిందని, అప్పుడే ఆమెను తొలిసారి చూశానని ఆయన చెప్పారు. ఆ తరువాత మరో సందర్భంలో ఆమె కలిసిందని ఆయన అన్నారు. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని ఆయన స్పష్టం చేశారు.

raja seakhar
movie actor
garudavega
  • Loading...

More Telugu News