అల్లు అర్హా: అమ్మ చెంత ముద్దులొలుకుతున్న అల్లు అర్హా !
- ఓ ఫొటోను పోస్ట్ చేసిన స్టైలిష్ స్టార్
- ముద్దులొలుకుతూ.. బోసినవ్వులు చిందిస్తూ పోజిచ్చిన అర్హ
- ‘స్టైలిష్ గర్ల్’ అంటూ నెటిజన్ల ప్రశంసలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో కూతురు చిన్నారి అర్హ, భార్య స్నేహారెడ్డి ఉన్నారు. అమ్మ చెంత ఉన్న అర్హ ముద్దులొలుకుతూ.. బోసి నవ్వులు చిందిస్తూ ఎంచక్కా ఫొటోకు పోజిచ్చింది.
అర్హను చూసి మురిసిపోతున్న స్నేహారెడ్డి ఫొటోను అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోపై నెటిజన్లు, అభిమానులు తమ తమ శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ మూవ్ మెంట్’, ‘అర్హ చాలా అందంగా ఉంది’, ‘స్టైలిష్ గర్ల్’ అంటూ ఆ ఫొటోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.