జగన్: వెన్నుపోటు పొడిచిన మీ బావ వెంట పారిపోయిన నువ్వా, జగన్ ని విమర్శించేది!: బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే మండిపాటు

  • ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
  • పిచ్చి ఉందనే సర్టిఫికెట్ తో ఓ కేసు నుంచి బాలకృష్ణ బయటపడ్డాడు
  • ఏదైనా మీటింగ్ కు వెళితే మీరు ఎవరినీ కొట్టకపోతే వింత 

వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బాలకృష్ణ గారూ!, అయ్యా, నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడుతున్నావు! నీకు పిచ్చి ఉందనే సర్టిఫికెట్ తో కేసులో నుంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా?  ‘నాకు పిచ్చి ఉంది, మతి స్థిమితం లేదు..మానసిక పరిస్థితి సరిగా లేదు’ అని చెప్పి ముంబైలోని ఓ ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకుని ఒక కేసులో నుంచి నువ్వు తప్పించుకున్నావు.

 మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన మీ బావ వెంట పారిపోయిన నువ్వు.. జగన్మోహన్ రెడ్డిగారిని విమర్శించడం సిగ్గుచేటు. ఒక మహనీయుడికి ఎలాంటి కొడుకులు పుట్టకూడదనే దానికి నిదర్శనం మీరు అయితే, పులి కడుపున పులే పుడతాడని చెప్పడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. బాలకృష్ణ ఏదైనా మీటింగ్ కు వెళితే ఎవరినీ కొట్టకపోతే వింతగా వుంటుంది. అటువంటి నువ్వు ప్రజల గురించి మాట్లాడటం, జగన్ ని విమర్శించడం సిగ్గుచేటు’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News