raman singh: అప్పుడే పుట్టిన మనవరాలిని ఎత్తుకుని మురిసిపోయిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్

  • తాత అయిన రమణ్ సింగ్
  • మనవరాలిని ఎత్తుకోవడం కన్నా ఆనందం ఏముందన్న సీఎం
  • తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందన్న రమణ్ సింగ్

చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తాతయ్యారు. ఈరోజు ఆయనకు మనవరాలు పుట్టింది. ఈ సందర్భంగా, అప్పుడే పుట్టిన ఆ పాపాయిని ఎత్తుకుని ఆయన మురిసిపోయారు. తన మనవరాలితో కలసి దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

భగవంతుడి అనుగ్రహంతో తమ ఇంటికి మనవరాలి రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని... మనవరాలిని ఎత్తుకోవడానికి మించిన ఆనందం తాతగా తనకు మరేదీ లేదని ఆయన ట్విట్టర్లో తెలిపారు. 2003 నుంచి చత్తీస్ ఘడ్ సీఎంగా ఉన్నారు రమణ్ సింగ్.

raman singh
chattisghad cm
  • Loading...

More Telugu News