ఒవైసీ: ఒవైసీ లాంటి వాడు ఏ దీపావళినాడైనా విందు భోజనం పెట్టాడా?: పరిపూర్ణానంద స్వామి
- ఎందుకు అని ప్రశ్నిస్తే మాత్రం చాలా పెద్ద తప్పైపోతుంది?
- మనలో ఐక్యత లేకపోవడమే వారికి బలహీనులుగా కనిపిస్తున్నాం
- అదే ఒక్కటై పిడికిలి బిగిస్తే ఎవ్వడైనా దిగి రావలసిందే
- ‘ఫేస్ బుక్’లో వీడియో పోస్ట్ చేసిన పరిపూర్ణానంద
రంజాన్, క్రిస్మస్ పండగలు వస్తే హిందువులుగా చెప్పుకునే నాయకులు ఏ పార్టీలో ఉన్నా వారికి విందులు ఇస్తారని, మరి, ముస్లిం లేదా క్రైస్తవ నాయకులు మన పండగలకు వచ్చి కనీసం పలుకరించిన వారున్నారా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ఈ ప్రశ్న సంధించారు. ఆ వీడియోలో పరిపూర్ణానంద ఏమన్నారంటే..
‘రంజాన్ వస్తే టోపీలు పెట్టుకుని విందులు
క్రిస్టమస్ వస్తే వీళ్లు దాదాపు పాస్టర్ లా వేషాలు
అదే ఒక ముస్లిం లేదా క్రైస్తవ నాయకులు మన పండుగలకు వచ్చి కనీసం పలుకరించిన వారున్నారా…?
ఒవైసీ లాంటి వాడు వచ్చి ఏ దీపావళినాడైనా విందు భోజనం పెట్టాడా
వారికి లేని మత సామరస్యం మీకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తే మాత్రం చాలా పెద్ద తప్పైపోతుంది?
ఆలోచన చేయండి…
ఈ రాజకీయ నాయకులు 20 శాతం వున్న వారికే అంత ప్రాధాన్యత ఇస్తే మరి 80 శాతం వున్న మనకెంత ప్రాధాన్యత ఇవ్వాలి..?
ఇదేం విధానం…
మనలో ఐక్యత లేకపోవడమే వారికి బలహీనులుగా కనిపిస్తున్నాం
అదే ఒక్కటై పిడికిలి బిగిస్తే ఎవ్వడైనా దిగి రావలసిందే…’ అని పేర్కొన్నారు.