lakshmis veeragrandham: 'లక్ష్మీస్ వీరగ్రంధం' షూటింగ్ రేపే ప్రారంభం.. అందరూ ఆహ్వానితులే!

  • ఎన్టీఆర్ గార్డెన్స్ లో పూజా కార్యక్రమం
  • 11.30కు ముహూర్తం
  • ఫేస్ బుక్ లో ఇన్విటేషన్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన వెంటనే... 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో సినిమా తీస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. తాజాగా, ఈ సినిమాకు ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. నవంబర్ 12 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్యలో ముహూర్తాన్ని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ సమాధి వద్దే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. జయం మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ముహూర్తానికి సంబంధించిన ఇన్విటేషన్ ను ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ముహూర్తపు పూజకు అందరూ ఆహ్వానితులే అని ఇన్విటేషన్ లో పేర్కొన్నారు.

lakshmis veeragrandham
lakshmis veeragrandham shooting
ntr
lakhmi parvathi
ketireddy jagadeeswar reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News