harassment: సినిమా షూటింగ్ లో పరిచయం...ప్రేమించకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ వేధింపులు

  • సినిమా షూటింగ్ సందర్భంగా యువతిని కలిసిన సమీర్
  • ప్రేమించాలంటూ వేధింపులు
  • ప్రేమించకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు
  • ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించిన యువతి

ప్రేమించకపోతే మార్పింగ్ చేసిన అసభ్యకర చిత్రాలు బంధువులకు, స్నేహితులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు, ఎల్బీనగర్ లోని హస్తినాపురంకి చెందిన యువతి (19)కి నెల రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో అమీర్ పేట ప్రాంతానికి చెందిన సమీర్ తో పరిచయం ఏర్పడింది.

ఆ తరువాత తనను ప్రేమించాలంటూ సమీర్ ఆమె వెంటపడడం ప్రారంభించాడు. ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు దిగుతున్నాడు. దానికి నిరాకరించడంతో తనను ప్రేమించకపోతే ఆమె ఫొటోలు మార్పింగ్ చేసి, సోషల్ మీడియా ద్వారా ఆమె బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

harassment
Hyderabad
girl harassed
  • Loading...

More Telugu News