kishan reddy: కేసీఆర్ తీరు తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనం కావడమే తప్పన్నట్టుంది!: కిషన్ రెడ్డి ధ్వజం

  • వాస్తవాలు వక్రీకరించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు
  • నిజాం చరిత్రను తిరగరాయడం సరికాదు
  • తెలంగాణా రాష్ట్రమా? లేక మజ్లిస్ తెలంగాణ రాష్ట్రమా? అన్న డౌట్ వస్తోంది

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు తెలంగాణ భారతదేశంలో విలీనం కావడమే తప్పన్నట్టు ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాస్తవ చరిత్రను వక్రీకరించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజాం చరిత్రను తిరగ రాయిస్తామనడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

 సీఎం మాటలు వింటుంటే ఇది తెలంగాణ రాష్ట్రమా? లేక మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్రామా? అన్న అనుమానం తలెత్తుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఏదైనా విషయం చెబితే ఆ వెంటనే దానిపై సచివాలయం నుంచి జీవో విడుదలవుతోందని ఆయన మండిపడ్డారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లను పొగుడుతూ పాలన సాగిస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్ కు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News