singer radhika: 'బావలు సయ్యా.. హే మరదలు సయ్యా' పాటతో ఉర్రూతలూగించిన రాధిక మృతి

  • తిరుపతి అమ్మాయి గాయని రాధిక మృతి
  • తెలుగులో పలు పాటలు పాడిన రాధిక
  • చెన్నైలో నేడు ఆమె అంత్యక్రియలు

'బావలు సయ్యా.. హే మరదలు సయ్యా' అనే పాట ఇప్పటికీ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటుంది. సిల్క్ స్మిత, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ లపై 'బావ- బావమరిది' సినిమా కోసం చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో చాలా పాప్యులర్ అయింది. ఈ పాట పాడిన గాయని రాధిక.

తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాధిక తుదిశ్వాస వదిలారు. గుండెపోటుతో నిన్న ఉదయం చెన్నైలోని పాలవాక్కంలో ఆమె మృతి చెందారు. రాధిక వయసు 47 ఏళ్లు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ, గాయకుడు మనో సంతాపం తెలిపారు. చెన్నైలోని పాలవాక్కంలో ఆమె అంత్యక్రియలు ఈరోజు జరగనున్నట్టు ఆమె భర్త శశికుమార్ తెలిపారు.

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆమె 200కు పైగా పాటలు పాడారు. ఆమె స్వస్థలం తిరుపతి. తెలుగు సినిమాల్లో ఆమె పలు పాటలు పాడారు. రౌడీ అల్లుడు సినిమాలో 'అమలాపురం బుల్లోడా నే బొంబాయి సూడాలా'... 'నరసింహనాయుడు' సినిమాలో 'చిలక పచ్చ కోక.. పెట్టినాది కేక'... అన్నయ్య సినిమాలో 'ఆట కావాలా.. పాట కావాలా'లాంటి ఎన్నో హిట్ సాంగ్స్ ను ఆమె పాడారు. 2004 నుంచి ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 

  • Loading...

More Telugu News