bat: కొండచిలువ, గబ్బిలం మధ్య పోరాటం.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూడండి

  • చెట్టుమీద గబ్బిలాన్ని ఒడిసి పట్టేసిన కొండచిలువ
  • అరగంటపాటు సాగిన పోరాటం
  • ఓడిపోయిన కొండ చిలువ..ఎగిరిపోయిన గబ్బిలం
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన టోనీ మారిసన్

కొండచిలువ-గబ్బిలం మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏవైనా జంతువులు తన కంటబడితే, వేగంగా కదిలి ఒక్క ఉదుటున పట్టిబంధించి ఆహారంగా తీసుకునే కొండచిలువ ఇప్పుడు ఓ గబ్బిలాన్ని పట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చోటుచేసుకున్న ఈ ఘటనను వీడియో తీసిన టోనీ మారిసన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.

ఒక చెట్టుపైకి వెళ్లిన కొండచిలువ అక్కడ తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాన్ని టక్కున పట్టేసుకుని, చుట్టేసింది. దీంతో గబ్బిలం గింజుకుంది. మింగడానికి కొండచిలువ, ఒదిలించుకునేందుకు గబ్బిలం హోరాహోరీ పోరాడాయి. సుమారు అర గంటపాటు సాగిన ఈ పోరాటంలో కొండచిలువ ఓడిపోగా, గబ్బిలం బతుకుజీవుడా అంటూ ఆకాశంలోకి తుర్రుమంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి. 

bat
python
fight
Australia
  • Error fetching data: Network response was not ok

More Telugu News