Bhojpuri: నష్టాల ఊబిలో చిక్కుకుని.. ప్రాణం తీసుకున్న భోజ్‌పురి దర్శకుడు

  • పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్ కుమార్
  • ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • ఈ నెల 24న విడుదల కానున్న ఆయన తాజా చిత్రం

భోజ్‌పురి చిత్రాల దర్శకుడు షాద్ కుమార్ (50) ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాద్ కుమార్ అసలు పేరు షంషాద్ అహ్మద్. మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో న్యూ సలోనీ హైట్స్ కోఆపరేటివ్ సొసైటీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన షంషాద్ భార్య బానో షంషాద్ సీలింగ్‌కు వేలాడుతున్న భర్త మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పలు చిత్రాలు తీసి ఆర్థికంగా నష్టపోవడంతో గత కొంతకాలంగా తన భర్త తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు బోనా షంషాద్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షంషాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ లైలా’, ‘టీన్ చైలా’, ‘బెయిల్ తోహ్రా సె ప్యార్’, తుమ్హారే ప్యార్ కె కసమ్’ వంటి పలు భోజ్‌పురి చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆయన తాజా చిత్రం ‘స్వర్గ్’ ఈనెల 24న విడుదల కావాల్సి ఉంది.

Bhojpuri
director
suicide
Shad Kumar
  • Loading...

More Telugu News