: రాష్ట్ర కాంగ్రెస్ లో 'నాలుగు' స్థంభాలాట!
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కిక్కురుమనని కాంగ్రెస్ అసమ్మతి వర్గాలు ఆయన మరణానంతరం తమ ప్రభావం చూపుతున్నాయన్నది నిష్ఠుర సత్యం. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఈ అసమ్మతి రాగాలు మరింత పై శృతిలో వినిపించసాగాయి. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ఇవి మామూలే అని రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట.
అయితే, ఈ గ్రూపు గొడవల పంచాయతీ ఇప్పుడు అధినేత్రి సోనియా వద్దకు చేరింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావద్దని ఆమెకు సూచించిన ఎంపీ కావూరి సాంబశివరావు.. సోనియాకు పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు గ్రూపులుగా విడిపోయిందని కావూరి.. మేడమ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, చిరంజీవి కాంగ్రెస్, అసమ్మతి కాంగ్రెస్ గా రాష్ట్ర కాంగ్రెస్ లో చీలికలు వచ్చాయని ఆయన వివరించారట. దీనిపై సోనియమ్మ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి!.