‘అర్జున్ రెడ్డి’: ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ వెర్షన్ పేరు ‘వర్మ’ అంట: రామ్ గోపాల్ వర్మ

  • తమిళంలో ‘అర్జున్ రెడ్డి' రీమేక్ 
  • ఆ వెర్షన్ పేరు ‘వర్మ’ అట 
  • ఆ పేరు ఎక్కడో విన్నట్టు, గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది.. అంటున్న వర్మ   

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని తమిళ్ లో కూడా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు ‘వర్మ’ అంట.. ఆ పేరు ఎక్కడో విన్నట్టు, గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్న వర్మ, ఓ పోస్టర్ ను జతపరిచారు.

  • Loading...

More Telugu News