బీసీసీఐ: క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు అంగీకరించం: బీసీసీఐ
- జాతీయ క్రీడల సమాఖ్య పరిధిలోకి క్రికెట్ రాదు
- క్రికెటర్లకు డోపింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు
- నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చీఫ్ కు తేల్చి చెప్పిన బీసీసీఐ
జాతీయ క్రీడల సమాఖ్య పరిధిలోకి క్రికెట్ రాదని, క్రికెటర్లకు డోపింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి బీసీసీఐ తెలిపింది. క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించేందుకు అంగీకరించమని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చీఫ్ నవీన్ అగర్వాల్ కు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ స్పష్టం చేశారు. ఐసీసీ నిబంధనలను బీసీసీఐ పాటిస్తుందని ఈ సందర్భంగా జోహ్రీ తెలిపారు.