sunith: నాతో మిస్ బెహేవ్ చేసినవారున్నారు .. ఇబ్బందులు కూడా పడ్డాను: సింగర్ సునీత

  • మిస్ బిహేవ్ చేసే వాళ్లు ప్రపంచంలో ప్రతి చోటా వుంటారు 
  • అలాంటి వాళ్లను కంప్లీట్ గా కట్ చేసే దానిని 
  • అలా చేయడం వలన వాళ్ల ఈగో హర్ట్ అయ్యేది 
  • అందువలన కొన్ని ఇబ్బందులు తప్పలేదు        

యాంకర్ గా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా సునీతకి మంచి గుర్తింపు వుంది. అందరూ ఆమెను అందమైన కోకిలగా పిలుచుకుంటూ వుంటారు. అలాంటి సునీత వృత్తి పరమైన జీవితంలోను .. వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. "మీతో ఎవరైనా మిస్ బిహేవ్ చేశారా? అప్పుడు మీరు ఏం చేశారు" అనే ప్రశ్న సునీతకి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. " నా పట్ల మిస్ బిహేవ్ చేసిన వారున్నారు .. అలాంటివాళ్లు ప్రపంచంలో ప్రతి చోటా వుంటారు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ ఉండటానికి అస్సలు ఇష్టపడేదానిని కాను. ఎస్ చెప్పకుండా .. నో చెప్పకుండా .. అలా బిహేవ్ చేసిన వారిని కంప్లీట్ గా కట్ చేసే దానిని .. దాంతో వాళ్ల ఈగో హర్ట్ అయ్యేది. ఆ కారణంగా నేను ఇబ్బందులు పడ్డాను .. ఎన్నో అనుభవించాను. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీలో మాత్రం నాకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాలేదు" అంటూ చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News