virendra sehwag: బెల్జియం రాజుకు క్రికెట్ పాఠాలు చెప్పిన సెహ్వాగ్!

  • భారత పర్యటనలో ఉన్న బెల్జియం రాజు ఫిలిప్పి
  • ముంబైలోని కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిప్పి, సెహ్వాగ్
  • విద్యార్థులతో కలసి కాసేపు క్రికెట్ ఆడిన రాజు

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ కోచ్ అవతారమెత్తి, క్రికెట్ పాఠాలు చెప్పాడు. ఆయన పాఠాలు చెప్పింది ఆటగాళ్లకు కాదు, బెల్జియం రాజు ఫిలిప్పికి. బెల్జియం రాజు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఫిలిప్పి తన భార్య మాతిల్డేతో కలసి ఇండియాకు వచ్చారు.

పర్యటనలో భాగంగా ఈ రోజు వారు ముంబైలోని ఓవల్ గ్రౌండ్ ను సందర్శించారు. యూనిసెఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఫిలిప్పి దంపతులు పాఠశాల విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా వీరికి క్రికెట్ మెలకువలు నేర్పించాడు సెహ్వాగ్. ఆ తర్వాత వీరికి ఓ బ్యాట్ ను కానుకగా ఇచ్చాడు. రేపటి వరకు ఫిలిప్పి దంపతులు భారత్ లో వుంటారు.

virendra sehwag
team india
belgium king
unicef
  • Loading...

More Telugu News