vijay: తెలుగులో పోటీ పడుతోన్న తమిళ మాస్ హీరోలు

  • 'అదిరింది' పేరుతో తెలుగులో విడుదలైన 'మెర్సల్'
  • 'డిటెక్టివ్' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'తుప్పరివాలన్'
  • రెండు సినిమాలకి భారీ ఓపెనింగ్స్

విజయ్ హీరోగా 'దీపావళి' కానుకగా తమిళంలో విడుదలైన 'మెర్సల్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 'అదిరింది' టైటిల్ తో ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాకి ఇక్కడ చేసిన పబ్లిసిటీ అంతంత మాత్రమే. అయినా తమిళంలో 'మెర్సల్' వివాదం .. తెలుగులోను ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. దాంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ లభించాయి. విజయ్ కి ఇక్కడ పెద్దగా క్రేజ్ లేకపోయినా, ఈ సినిమాకి వసూళ్లు బాగుంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న విశాల్ 'తుప్పరివాలన్' .. 'డిటెక్టివ్' పేరుతో ఈ రోజున తెలుగులో విడుదలైంది. డిఫరెంట్ లుక్ తో .. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో విశాల్ అదరగొట్టేశాడని అంటున్నారు. అద్వైత భూషణ్ గా ఆయన పాత్ర ఆకట్టుకునేలా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిందని అంటున్నారు. తమిళంలో మాస్ హీరోలుగా మంచి మార్కులు కొట్టేసిన విజయ్ - విశాల్ .. ఇక్కడ ఇలా పోటీ పడుతున్నారన్నమాట.             

  • Loading...

More Telugu News