ap assembly sessions: అసెంబ్లీలో మాట్లాడనీయడం లేదు.. వాస్తవాలను చెప్పుకునే అవకాశం లభించడం లేదు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే

  • ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి మెజారిటీ నిధులు కేంద్రానివే
  • ఇది చెప్పుకునే అవకాశం కూడా దొరకడం లేదు
  • సభలో సొంత భజన ఎక్కువవుతోంది

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించామని... కానీ, స్పీకర్ తమను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

 అమృత హస్తం పథకంపై బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి మెజారిటీ నిధుల్ని ప్రధాని మోదీ ఇస్తున్నారనే విషయాన్ని సభలో చెప్పుకునే అవకాశం కూడా తమకు లేకుండా పోయిందని ఆయన వాపోయారు. అసెంబ్లీలో టీడీపీ నేతల సొంత భజనే కొనసాగుతోందని... భజన ఓ మోస్తరు వరకు ఉంటే వినసొంపుగా ఉంటుందని, ఇది శ్రుతి మించితే చెవి నొప్పులు వస్తాయని అన్నారు.

ap assembly sessions
vishnu kumar raju
Telugudesam
bjp
  • Loading...

More Telugu News